మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి 11 మందికి గాయాలు నలుగురి పరిస్థితి విషమం
అక్షర విజేత, పెద్ద శంకరంపేట్:
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ మండల్ కోలపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే విజయనగరం వాసులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శ్రీశైల నుండి తుల్జాపూర్ భవాని మాతను దర్శించుకునేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద శంకరంపేట మండలం కోలపల్లి వద్దకు రాగానే ఆగి ఉన్న ట్రావెల్ బస్సును వెనుక నుండి అతివేగంతో డీసీఎం బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. నారాయణమ్మ (50) సురాపమ్మ (60) మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న పెద్ద శంకరంపేట ఎస్ఐ శంకర్, సిబ్బంది అక్కడికి చేరుకొని శతఘాతులను చికిత్స నిమిత్తం జోగిపేట్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అందులో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.