*ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలించిన వేళ మామడ లో అంబేడ్కర్ చౌక్ వద్ద సంబరాలు…*
అక్షరవిజేత మామడ:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించిన సందర్భంగా మామడ మండలకేంద్రంలో ని అంబెడ్కర్ చౌక్ వద్ద గురువారం మాదిగ సంఘం ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.. ఈ ఎస్సి వర్గీకరణ ముప్పై ఏళ్ళు గా పోరాటం చేసి సాధించిన ఇచ్చిన తమ మాదిగల గుండె చప్పుడు మందకృష్ణ మాదిగ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో మోతె రాజన్న,ఆశన్న,అశోక్, పోశెట్టి,తిరుపతి,పోశెట్టి ముండ్ల అంజన్న,మనోజ్ తదితరులు పాల్గొన్నారు.