*సారా బట్టి పై దాడి ఎస్ఐ కే షరీఫ్*
– 70 లీటర్లు నాటు సారా.
– 100 లీటర్లు పులిచిన బెల్లపుఊట.
– సారా కి ఉపయోగపడే పాత్రలు ధ్వంసం.
– ఒక వ్యక్తి అరెస్టు.
అక్షరవిజేత ,దేవీపట్నం :
అల్లూరి సీతారామరాజు రంపచోడవరం రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఎస్ రామన్నపాలెం గ్రామ చివర్న నాటు సారా తయారు చేస్తున్నారని వచ్చిన సమాచారమేరకు దేవీపట్నం ఎస్ఐ కే షరీఫ్ తన సిబ్బందితో దాడులు నిర్వహించి 70 లీటర్ల నాటు సారా కవర్లో కట్టి ఉన్న వాటిని గుర్తించారు.పక్కనే ప్లాస్టిక్ డ్రమ్ములో 100 లీటర్లు పులిసిన బెల్లపు ఊట ను సారా కాచేందుకు ఉపయోగించే పాత్రలను ధ్వంసం చేసి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఎస్సై కే షరీఫ్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో నాటు సారా విక్రయిస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అలవాటు పడి యువత చేతులారా కుటుంబాలు చిన్నాభిన్నం చేసుకుంటున్నారని సారా మహమ్మారి ని ఎవరైనా అమ్మిన ప్రోత్సహించిన ఉపేక్షించేది లేదని తేల్చి చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో మద్యం మత్తులో అనేక రకరకాల గొడవలు, యాక్సిడెంట్లు కారణం అవుతున్నారని అటువంటి మత్తు పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అన్నారు. మండలంలో ఎవరి దగ్గరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సమాచారం ఉంటే డైరెక్ట్ గా స్టేషన్ నెంబర్ 94409 00763 కి సమాచారం ఇవ్వాలని కోరారు. ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతానని చెప్పారు.