*తెలుగు ఉపాధ్యాయుడు నరేందర్ సేవలు అభినందనీయం*..
👉 *మోడల్ స్కూల్స్ డిప్యూటీ డైరెక్టర్*..
👉 *ప్రిన్సిపాల్ ని ప్రశంసించిన డిప్యూటీ డైరెక్టర్*..
అక్షరవిజేత,దౌల్తాబాద్ :
దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్ సర్ మరియు తెలుగు ఉపాధ్యాయులు నరేందర్ అధ్వర్యంలో మంగళవారము నాడు తెలుగు భాష సంబరాలు ఘనంగా జరిగాయి.ముఖ్య అతిధిగా మోడల్ స్కూల్స్ డిప్యూటీ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ సర్ పాల్గొన్నారు. పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్, కిచెన్ షెడ్, స్పోర్ట్స్ గ్రౌండ్ మొదలగు వాటిని పరిశీలించి చాలా బాగున్నాయని ప్రిన్సిపాల్ ని అభినందించారు.ఈ సందర్భంగా పాఠశాలలోని 6,7,8 తరగతులకు పద్యపఠన పోటీలు, బుర్రకథ పోటీలు, ధారాళంగా చదివే పోటీలు నిర్వహించారు.ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు..తెలుగు ఉపాధ్యాయులు నరేందర్ సుమారు 7 వేల రూపాయల విలువైన మెమొంటోలు, పరీక్ష ప్యాడ్స్, వాటర్ బాటిల్స్, 300 మంది పిల్లలకు కన్సోలేషన్ బహుమతులు తీసుకొచ్చి , డిప్యూటీ డైరెక్టర్ మరియు ప్రిన్సిపాల్ చేతుల మీదుగా అందచేశారు.ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్, ప్రిన్సిపాల్ అనర్ఘలంగా పద్య పఠనం చేసిన విద్యార్థులను, బుర్రకథ ప్రదర్శన చేసిన విద్యార్థులను, వారి ప్రతిభా నైపుణ్యాలను చూసి ఎంతో అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు తమ నైపుణ్యాలను, సృజనాత్మకతను ప్రదర్శించి, తెలుగు భాష పట్ల ఉన్న ఆసక్తిని అభినందించారు.పద్యపఠన విభాగంలో 50 పద్యాలు, బుర్రకథ ప్రదర్శన, ధారాళంగా చదివే పోటీల్లో ఒక నిమిషానికి 50 నుండి 150 పదాల వరకు చదివారని అభినందించారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి ఈ పోటీలు నిర్వహించి విజేతలకు, విద్యార్థులందరికీ బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు నరేందర్ ని అభినందిస్తూ , పిల్లల అబివృద్దికి తమ వంతు కృషి చేస్తున్నందుకు ప్రశంసించారు.తెలుగు భాష అభివృద్ధి కోసం మనందరం కృషి చేయాలని, తెలుగు భాష అమ్మ భాష అని, మాతృ భాషలో ఉన్న గొప్పతనం అందరూ తెల్సుకోవాలి అని అన్నారు.అనంతరం ప్రిన్సిపాల్ డైరెక్టర్ కి మెమొంటో అందచేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా తెలుగు ఉపాద్యాయులు నరేందర్ మాట్లాడుతూ ముందుగా మాకు పూర్తిగా ప్రోత్సాహం అందిస్తూ, మా వెన్నంటి ఉండి, నిరంతరం విద్యార్థుల అబివృద్దికి కృషి చేస్తున్న ప్రిన్సిపాల్ కి ధన్యవాదములు తెలుపుతూ మెమొంటో అందచేసి శాలువాతో సన్మానించారు.పిల్లలందరూ చాలా ఉత్సాహంగా అన్నీ పోటీలలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని అన్నారు.విద్యార్థులు అందరూ ఒకరితో ఒకరు పోటిపడి నేర్చుకున్నారని, ఈ పోటీల వల్ల చాలా మంది పిల్లల్లో చదవాలనే ప్రేరణ, కొత్త విషయాలను అభ్యసించాలనే ఉత్సాహం, పద్యాలు అభ్యసించాలనే కోరిక కలిగింది..అని తెలిపారు.పిల్లలలో ఈ విధమైన పోటీతత్వం పెరగడం అనేది..తెలుగు భాష ఉపాధ్యాయుడుగా నాకు ఎంతో సంతోషదాయకం అని అన్నారు.ఉపాధ్యాయులుగా మాకు ఇంతకంటే ఎక్కువ ఆనందం ఏమి లేదని అన్నారు..ఇంకా ఈ కార్యక్రమంలో ఇంఛార్జి శివ ప్రకాష్ సర్, ఉపాధ్యాయుల బృందం పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.