*ఎమ్మెల్యే కాలే యాదయ్య చాలా మంచివాడు*
*అందరిని కలుపుకొని పోయే వ్యక్తిత్వం*
*తమ స్వార్థం కోసం ఎమ్మెల్యేను పక్కదారి పట్టిస్తున్న నాగిరెడ్డి*
*కాంట్రాక్టర్ ల కోసం కకృతి పడుతున్న నాగిరెడ్డి*
*కాంగ్రెస్ పార్టీ నవాబ్ పేట్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సామ వెంకట్ రెడ్డి*
అక్షరవిజేత, వికారాబాద్ ప్రతినిధి :
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య చాలా మంచివాడు అని నవాబ్ పెట్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సామ వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సామ వెంకట్ రెడ్డి మీడియా ముఖంగా మాట్లాడుతూ, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అందరిని కలుపుకొని పోయే వ్యక్తిత్వం ఉన్న మంచి మనిషి అని కొనియాడారు. తమ స్వార్థం కోసం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నాగిరెడ్డి ఎమ్మెల్యే కాలె యాదయ్యను పక్కదారి పట్టిస్తున్నాడని ఆవేదనను వ్యక్తం చేశారు. తమ కాంట్రాక్టర్ ల కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్న నాగిరెడ్డి ని చూస్తే జాలేస్తుందని అన్నారు. నాగిరెడ్డి వలన నవాబు పేట్ మండల కాంగ్రెస్ పార్టీ కలుషితమయిందని, వెంటనే కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోవాలని అన్నారు. నాగిరెడ్డిని రాజకీయాలలోకి తీసుకొచ్చింది మీమేనని, ప్రస్తుతం ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. నాగిరెడ్డి నీచమైన చరిత్ర అందరికీ తెలుసని, మాపై అనవసర ఆరోపణలు చేస్తే సహించేది లేదని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.