ఫణిగిరి బౌద్ధ క్షేత్ర చిత్రకళా ప్రదర్శన అపూర్వం
చిత్రకారుడి ఊహలకు ప్రతిరూపమే చిత్రకళ
రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ ఊర రామ్మూర్తి
- అక్షరవిజేత , సూర్యాపేట ప్రతినిధి :
చిత్రకారుడి మదిలో మెదిలే ఊహలకు ప్రాణం పోస్తే కాన్వాస్ పై అది చిత్రకళ అవుతుందని, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫనిగిరి బౌద్ధ క్షేత్రం గురించి ప్రత్యేక ఆర్ట్ ప్రదర్శన ద్వారా ప్రపంచానికి తెలియజెప్పడం అపూర్వమని,తెలియని విషయాలను మన కండ్లకు కనిపించేటట్టుగా ప్రత్యక్షంగా చూపించిదే ఆర్ట్ అని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, ఉండ్రుగొండ గిరిదుర్గం డెవలప్మెంట్ చైర్మన్ ప్రముఖ వైద్యులు డాక్టర్ ఊర రామ్మూర్తి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రం పాత మున్సిపల్ ఆఫీసు రోడ్ రాజు ప్లెక్స్ పక్కన సూర్యాపేటకు చెందిన అంతర్జాతీయ చిత్రకారుడు శిరం శెట్టి ఆనంద్ ఫణిగిరి బుద్దిస్ట్ సైట్ గురించి వేసిన చిత్రాల ప్రదర్శన ప్రారంభించడంతోపాటు ఫణిగిరి బుద్ధిష్టు సైట్ పుస్తక ఆవిష్కరణ డాక్టర్ రామ్మూర్తి చేతుల మీదుగా ఆవిష్కరించారు. చిత్రకళ ప్రదర్శన, పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగిస్తూ ఆర్టిస్టులను అంతర్జాతీయ స్థాయిలో తీసుకుపోవడానికి ప్రముఖ ఆర్టిస్ట్ శిరంశెట్టి ఆనంద్ శ్రమ ఎంతో కొనియాడ తగిన విషయమన్నారు. ఒకప్పుడు బుద్ధుడు ఏ విధంగా జీవించాడనే విషయం తో పాటు ఏ విధంగా ప్రజలకు బోధనలు అందించాడని అనే నాటి సంగతులన్నీ కండ్లకు కట్టినట్టుగా ఆర్ట్ ద్వారా చూపించడం ప్రశంసనీయమన్నారు. బుద్ధుని విలువలను తెలపడానికి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషమని, 64 కళల్లో ఇది తొమ్మిదో కళ అని అన్నారు. అప్పుడు కళలను రాజులు కాపాడే వారని, ఇప్పుడు రాజులు లేరు, రాజ్యాలు లేవు అని, ఈ కళలను కాపాడే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. సీనియర్ సంపాదకులు, సామాజికవేత్త డేగల జనార్ధన్ మాట్లాడుతూ ఆధునిక జీవితంలో కళాకారులకు, కళలకు ప్రాధాన్యత తగ్గిపోవడం విచారకరమని, మనిషిని మనిషిగా చూసే మానవతా సమాజం కోసం అందరం కృషి చేయాలని కోరారు. ఒక చిన్న కార్టూన్ పాలకులను ప్రభావితం చేసేదని, మనిషిని మనిషిగా చూసే మానవీయ అభివృద్ధి కావాలని, కంప్యూటర్ సాంకేతికతనే కాదు కుంచె ద్వారా కళాకారుడు బతకాలని, కేవలం వైజ్ఞానిక శాస్త్రాలే కాదు సామాజిక శాస్త్రాల ప్రాధాన్యత ఇంకా పెరగాలని ఆకాంక్షించారు. గోల్డ్ మెడలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కృష్ణ బంటు మాట్లాడుతూ ప్రపంచానికి మానవత్వపు దారి చూపిన బుద్ధుని తత్వం చిత్రాల ద్వారా ప్రపంచ స్థాయికి తెలియచెప్పేలా నిరంతర శ్రమకు ఓర్చి, పట్టు వదలని విక్రమార్కుడిలా తన జన్మభూమి సూర్యాపేట పేరును ప్రపంచ స్థాయిలో చాటిన సీనియర్ చిత్రకారుడు శిరంశెట్టి ఆనంద్ జీవిత ఆశయాన్ని సాధించిన ధన్యజీవి అన్నారు. ప్రముఖ కవి మహమ్మద్ అమిద్ ఖాన్, బాల భవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ రెడ్డి, ట్రేడ్ యూనియన్ నాయకులు నీలా శ్రీను, కార్టూనిస్ట్ పల్లె మణి బాబు, మాజీ కౌన్సిలర్ జ్యోతి కరుణాకర్, వల్దాస్ దేవేందర్, వీరు నాయుడు,ఆర్టిస్టులు పవన్, బి కే రాజు, శ్రీను, వాస కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జూనియర్ ఘంటసాల బుర్రి వెంకటేశ్వర్లు తన గాన మాధుర్యంతో అలరించారు.