టెన్త్ పరీక్షలకు సిద్ధమైన 352 మంది విద్యార్థులు
అక్షరవిజేత,కంగ్టి :
కంగ్టిమండలంలో టెన్త్ తరగతి పరీక్షలు ఈ సంవత్సరం మొత్తం 352 మంది విద్యార్థులు రాయనున్నారని మండల విద్యాధికారి (ఎంఈఓ) రహీమొద్దీన్ తెలిపారు. విద్యార్థులకు ఉత్తమమైన పరీక్షా వాతావరణాన్ని కల్పించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారని ఆయన పేర్కొన్నారు.రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఎంఈఓ వెల్లడించారు. వివిధ పాఠశాలల నుంచి ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల వివరాలను వెల్లడిస్తూ,కంగ్టి జడ్పిహెచ్ఎస్ పాఠశాల నుండి 124 మంది, తడ్కల్ ఉర్దూ మీడియం పాఠశాల నుంచి 04 మంది, తడ్కల్ జడ్పీహెచ్ఎస్ నుంచి 107 మంది,కంగ్టి గిరిజన గురుకుల పాఠశాల నుంచి 69 మంది,కంగ్టి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల నుంచి 32 మంది, ప్రైవేట్ పాఠశాలల నుంచి 16 మంది పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు.విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయేందుకు పరీక్షా కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు, సీసీ కెమెరాలు, చెదురుమదురు సంఘటనలు జరుగకుండా నిఘా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాల యాజమాన్యాలు, అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు.