సింగిల్ విండో చైర్మన్ సురగౌని రామన్ గౌడ్ సతీమణి గుండెపోటుతో మృతి
అక్షర విజేత వీపనగండ్ల:
వీపనగండ్ల మండల పరిధిలోని తూముకుంట గ్రామానికి చెందిన సింగల్ విండో చైర్మన్ సురగౌని రామన్ గౌడ్ సతీమణి రాధమ్మ శనివారం ఉదయం హైదరాబాదులోని నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్,బీఆర్ఎస్ పార్టీ రైతుబంధు సమితి సమన్వయ మాజీ అధ్యక్షుడు ముంత మల్లయ్య యాదవ్, కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ మాజీ దర్శకుడు చాపల సాయిబాబా,యువ నాయకుడు ముంత శివ యాదవ్, వివిధ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు,ఎంపీటీసీలు తదితరులు సంతాపం తెలిపారు.