— 10:30 దాటిన విధులకు హాజరవని అధికారులు…
— అధికారుల కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్న ఆర్జిదారులు
అక్షర విజేత, చందుర్తి / రాజన్న సిరిసిల్ల ప్రతినిధి :చందుర్తి మండల కేంద్రంలోని స్థానిక తాసిల్దార్ కార్యాలయంలోని అధికారులు సమయపాలన పాటించడం లేదని ఆర్జిదారులు వాపోతున్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో అధికారులు సమయం 10:30 దాటిన తాసిల్దార్ తో పాటు ఏ ఒక్క అధికారి కూడా కార్యాలయానికి రాకపోవడం గమనార్హం.. దీంతో వివిధ గ్రామాల నుండి వివిధ పనుల నిమిత్తం ఆర్జీలు పెట్టుకోవడానికి వచ్చిన వారంతా గంటల తరబడి అధికారుల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు సమయపాలన పాటించి సమయానికి కార్యాలయానికి వచ్చి ప్రజల నుండి వినతులు, ఆర్జీలను స్వీకరించాలని కోరుతున్నారు.