వెలగొండ 11 కెవి విద్యుత్ కు అంతరాయం కలిగిస్తే చర్యలు తప్పవు
వీపనగండ్ల విద్యుత్ ఏఈ భగవంతు నాయక్
అక్షర విజేత వీపనగండ్ల:
వీపనగండ్ల మండల కేంద్రం పరిధిలోని వెలగొండ 11 కెవి విద్యుత్ కు ఇతరులు ఎవరైనా అంతరాయం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విద్యుత్ ఏఈ భగవంతు నాయక్ హెచ్చరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెలగొండ 11 కెవి విద్యుత్ కి గుర్తుతెలియని వ్యక్తులు గొలుసులు,ఇనుప కడ్డీలు లాంటివి తీగలపై వేసి విద్యుత్తు కు అంతరాయం కలిగించి అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏఈ తెలిపారు. కాబట్టి రైతులకు ఇబ్బంది చేయకుండా అందరూ సహకరించాలని తెలియజేయడం జరిగింది. వెలగొండ 11 కెవి విద్యుత్ కు అంతరాయం కలిగించే వ్యక్తులను ఎవరన్నా రైతులు గుర్తిస్తే 9440813504 గల నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగలరు అని ఏఈ భగవంతు నాయక్ తెలిపారు.