-
ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో వైద్య సిబ్బంది
లేరు..??
వైద్య సిబ్బంది కోసం గంటకు పైగా రైతులు ఎదురుచూపులు..!!
అక్షర విజేత వీపనగండ్ల:
వీపనగండ్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక పశువైద్య కేంద్రంలో వైద్య సిబ్బంది లేక వచ్చినటువంటి రైతులు ఎదురుచూస్తున్నారు. రైతులను అడిగి తెలుసుకోగా గంటకు పైన అవుతుంది వైద్య సిబ్బంది అందుబాటులో లేక రోజు ఇదే సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెప్పుకొచ్చారు. పశువులకు,గొర్రెలకు వైద్యం చేయించుకొని త్వరగా పొలాల కాడికి వెళ్లాలంటే మీరు మాత్రం సమయం పాటించకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పుకొచ్చారు. కాబట్టి జిల్లా ఉన్నత అధికారులు స్పందించి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.