భూ కబ్జా… చోద్యం చూస్తున్న తాసిల్దార్..721 సర్వే నెంబర్ భూమి ఎవరికి సొంతం..
ప్రభుత్వ భూములను కాపాడే నాటుడే లేడా..??
మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదు..??
స్థానిక అధికారులపై ఆరోపణ చేస్తున్న మాజీ సర్పంచ్ పుట్ట గంగిరెడ్డి
అక్షర విజేత వీపనగండ్ల:
వీపనగండ్ల మండల కేంద్రంలో 721 సర్వే నెంబర్ భూమిని ఇతరులు అక్రమంగా ఆక్రమించుకుంటున్నారని స్థానిక తాసిల్దార్ వరలక్ష్మి దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని మాజీ సర్పంచ్ పుట్ట గంగిరెడ్డి ఆరోపణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం భూమి ప్రధానమైన రోడ్డుపై కబ్జాకు గురవుతుందని గతంలోని స్థానిక తహసిల్దార్ వరలక్ష్మికి ఫిర్యాదు చేసిన ఆ ఫిర్యాదు పై ఎలాంటి చర్యలు లేవని మాజీ సర్పంచ్ పుట్ట గంగిరెడ్డి విమర్శించారు. ప్రభుత్వం భూమి ప్రధానమైన రోడ్డుపై ఇరువైపులా కంచ ఏర్పాటు చేసి కబ్జా చేస్తుంటే చూసి చూడనట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు.కబ్జాకు గురైతున్నటువంటి 721 సర్వే నెంబర్ భూమిని బాధ్యతరహితంగా అధికారులు చర్యలు తీసుకోకుండా చట్టాలను తుంగలతోకి కబ్జా చేస్తున్న వారి వైపు చూస్తూ వెళ్లిపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ చట్టాన్ని రెవెన్యూ అధికారులే ఉల్లంఘిస్తున్నారని మాజీ సర్పంచ్ గంగిరెడ్డి విమర్శించారు. 721 సర్వే నెంబర్ భూమిని ఆక్రమించిన వారిపై జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు.