చిరు వ్యాపారులే తొలి వైద్యులు
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
అక్షరవిజేత, పశ్చిమగోదావరి జిల్లా బ్యూరో:
ప్రజా ఆరోగ్య సంరక్షణలో చిరు వ్యాపారులే తొలి వైద్యులని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం పూరపాలక సంఘ కార్యాలయంలో స్వచ్ఛత, కల్తీ లేని ఆహారంపై తిరి వ్యాపారులకు శనివారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. చిరు వ్యాపారులు లాభసాటి వ్యాపారంతో ఆరోగ్యవంతమైన ఆహారాన్ని ప్రజలకు అందించేందుకు కృషి చేయాలని కోరారు. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నేటి నుంచి ఏడాదిపాటు ప్రతి నెల మూడో శనివారం నిర్వహించడం జరుగుతుందన్నారు. పరిశుభ్రత, ప్లాస్టిక్ నిషేధం, ఆహార పదార్థాలు తదితర అంశాలపై కార్యక్రమాలను చేపడతామన్నారు. పరిశుభ్రతపై ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కువకాలం ఆరోగ్యవంతంగా జీవించాలంటే నాణ్యమైన ఆహారాన్ని స్వీకరించాలన్నారు. భారతదేశానికి ఆహార వంటకాల్లో ప్రత్యేక స్థానం ఉందని ప్రస్తుతం విదేశీ పోకడలతో ఇంటి వంటలకు దూరమై బయట ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనారోగ్యాన్ని కొన్ని తెచ్చుకుంటున్నామని ఆమె ఆవేద వ్యక్తం చేశారు. తిరి వ్యాపారులు కల్తీ లేని నూనెతో ఆహార పదార్థాలను తయారు చేసి ప్లాస్టిక్ రహిత వస్తువులలో అందజేయాలన్నారు. కలుషిత ఆహారం వలన జీర్ణాశయ సమస్యలు, అవయవాల నిర్మాణంలో లోపం సృష్టిస్తున్నాయని, నిపుణులు అనుభవించిన ఫుడ్ కలర్స్ మాత్రమే వినియోగించాలని ప్లాస్టిక్‌ను నిరోధించాలని, టీ హోటల్స్ లో గాజు గ్లాసులు మాత్రమే వినియోగించాలని సూచించారు. హోటల్స్, బండ్లపై విక్రయించే ఆహార పదార్థాల తనిఖీకి ఆర్డిఓ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఫిబ్రవరి 1 నుంచి కమిటీ ఆకస్మికంగా తనిఖీలు చేపడుతుందని వారిచ్చే నివేదిక ఆధారంగా చర్యలో ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. స్థానిక శాసనసభ్యులు ,ప్రభుత్వవిప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కల్తీ ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కిడ్నీ,క్యాన్సర్ వంటి రోగాల బారినబడి ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అన్నారు. కల్తీ నూనె, టెస్టింగ్ సాల్ట్, ఫుడ్డ్ కలర్స్, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడ రాదని చెప్పారు. ప్రజల కాపాడాల్సిన సామాజి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందన్నారు. గిట్టుబాటు కాకపోతే ధరలు పెంచి నాణ్యమైన ఆహారాన్ని అందజేయాలని తనిఖీలలో ఎవరైనా దొరికితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆర్డిఓ ఖతీబ్ కౌసర్ భానో, మున్సిపల్ కమిషనర్ ఎం ఏసుబాబు, రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పైబోయిన రఘు, తాడేపల్లిగూడెం, పెంటపాడు ఎమ్మార్వోలు సునీల్ కుమార్, శ్రీనివాస్ చిరు వ్యాపారులు పాల్గొన్నారు.