*పల్లెల్లో సంక్రాంతి సంబరాలు*
– పట్నం నుంచి పల్లెలకు చేరిన ప్రజలతో కిట కిటలాడిన గ్రామాలు
– సంక్రాంతి సందర్భంగా ఎడ్ల బండ్ల ఊరేగింపు
– ఉత్సాహంగా పాల పొంగలి చేసిన మహిళలు
అక్షరవిజేత,తరిగొప్పుల :
తరిగొప్పుల మండల వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పట్నాల నుండి సొంత గ్రామాలకు చేరిన ప్రజలతో గ్రామాలు కిట కిటలాడాయి.యువకులు పిల్లలు గాలి పటాలు ఎగరేస్తూ… మహిళలు ముగ్గులు వేస్తూ సంబరాలు జరుపుకున్నారు. కనుమరుగు అవుతున్న సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఇంటి లొగిలలో నవధాన్యాల మధ్యలో పాల పొంగలి నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించి యువతులకు సంప్రదాయాల గురించి వివరించారు.
అనంతరం గ్రామ సంప్రదాయం ప్రకారం సాయంత్రం పూజలు నిర్వహించి ఎడ్ల బండ్లల ఊరేగింపు నిర్వహించారు. అనంతరం వాహన ఊరేగింపులు నిర్వహించి మండల ప్రజలు ఆనందోత్సాహాలతో మధ్య సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు.