*శ్రీ శ్రీ గట్టు మైసమ్మ అమ్మవారి జాతరకు ఏర్పాట్లలో భాగంగా ఎర్రమల్లె వాగు వద్ద శుభ్రం చేయించిన మున్సిపల్ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్*
అక్షర విజేత ప్రతినిధి మేడ్చల్ బ్యూరో, జనవరి 18;
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎర్రమల్లె వాగు వద్ద మట్టి పోపించి చుట్టు పక్కలున్న చెత్తను తీయించి శుభ్రం చేయించిన ఘట్కేసర్ మున్సిపల్ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్.ఈ సందర్భంగా ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ.. ఘట్కేసర్ మున్సిపాలిటీ గ్రామ దేవత పట్టణ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ శ్రీ గట్టు మైసమ్మ అమ్మవారి జాతర నేటి ఆదివారం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబంది ఉండకూడదు అని వాగు మీదుగా వచ్చే ప్రజలకు అనుగుణంగా ఉండేలా మట్టి పోపించి ఇరువైపులా కర్రలు నాటడం జరగిందని, చీకటి సమయం లో కూడా భక్తులు వచ్చేందుకు ఆ ప్రదేశం మొత్తం విధ్యుత్ దీపాలు ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు.
ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యం. ముత్యాలు యాదబ్, ప్రధాన్ కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, మాజీ బ్యాంక్ డైరెక్టర్ బొక్క ప్రభాకర్ రెడ్డి , నాయకులు రొడ్డ యాదగిరి , తదితరులు పాల్గొన్నారు.