నవోదయ పరీక్ష కేంద్రంను పరిశీలించిన డీసీపీ రాజమహేంద్ర నాయక్
అక్షరవిజేత, జనగామ:
జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశానికి శనివారం జనగామ జిల్లాలో డీఈవో రమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు.జిల్లా వ్యాప్తంగా 4 పరీక్ష కేంద్రాలకు గానూ 692 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం 10.30 గంటల్లోపే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోగా ఉదయం 11.30 గంటలకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోనీ స్థానిక దర్మకంచ జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీఎస్ఆర్ మల్లికార్జున్ ఇంచార్జీ గా వ్యవహరిస్తున్నారు. ఈ పరీక్ష కేంద్రం లో మొత్తం 152 మంది విద్యార్థిని విద్యార్థులకు గాను 7 గదులను ఏర్పాటు చేశారు. ఒక్కో గదికి 24 మంది విద్యార్థులను కేటాయించారు.7 గురు ఇన్విజిలేటర్ లు , ఇద్దరు క్లర్క్ లను నియమించి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు సీఎస్ఆర్ మల్లికార్జున్ ఇంచార్జీ తెలిపారు. పరీక్ష జరుగుతున్న తీరును వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ సిబ్బంది సిఐ దామోదర్ రెడ్డి,ఎస్సై చెన్న కేశవులు తో కలిసి పర్యవేక్షించారు.