ప్రభుత్వ హాస్పిటల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
అక్షరవిజేత, దేవరకొండ
దేవరకొండ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలోని మాత శిశు సంరక్షణ విభాగాన్ని, క్యాజువాలిటీని, డయాలసిస్ విభాగాలను తనిఖీ చేసి అక్కడ సౌకర్యాలు, రోగుల వివరాలను సూపరింటెండెంట్ బి. మంగ్య నాయక్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. అంతేకాక ఆసుపత్రికి వస్తున్న రోగుల వివరాలను, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ రిజిస్టర్లను తనిఖీ చేసి పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆర్టీవో రమణారెడ్డి మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ సిఐ నరసింహులు ఎస్ ఐ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు