నేడు తెలంగాణలో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు
అక్షరవిజేత,హైదారాబాద్ :
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం రాత్రి జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.