*ఘనంగా గణిత దినోత్సవం*
అక్షరవిజేత, తరిగొప్పుల :
తరిగొప్పుల మండల కేంద్రంలోనీ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ముందస్తు గణిత దినోత్సవం నిర్వచించారు.భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవంగా గణిత ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బానోతు రవీందర్ మాట్లాడుతూ భారతదేశానికి గణితంలో సుదీర్ఘమైన ప్రస్థానం ఉందని, మనం దీన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రామానుజన్ గణితంలో చేసిన కృషి గురించి నేటి తరానికి అవగాహన కల్పించడమే కాకుండా, మన దేశంలో గణిత శాస్త్ర అధ్యయనానికి అదనపు ప్రోత్సాహాన్ని అందించడంలో ఈ చర్యలు సహాయపడతాయని,విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలని,జీవితంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలకు తామే సరైన పరిష్కారం చూపేలా తయారు కావాలని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులచే గణిత కృత్యాలు,పాటలు ఆటలు నృత్యాలచే ఆనందంగా గడిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గాదె జోసెఫ్ బేబీ,మహమ్మద్ యూసఫ్ పాషా, పాలెపు విజయ,మచ్చ చిరంజీవులు, తాటేపల్లి పద్మ,ఆవుల అమర్నాథ్, దొంతుల శ్రీనివాస్, తెజావత్ శ్రీనివాస్, నాగవెల్లి అనిత, అజహర్ సుల్తానా, మారోజు కవిత శ్రీ , ఎం రవి, పాకాల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.