ఇంధనం లేక విమానం అత్యవసర ల్యాండింగ్
అక్షరవిజేత,రంగారెడ్డి :
చెన్నై నుండి పూణే వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఇంధనం సమస్య ఎదురయింది. దాంతో విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేసారు. పూనే వెళ్లడానికి సరిపడా ఇంధనం లేకపోవడంతో విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. విమానం సేఫ్ గా ల్యాండింగ్ అయింది. విమానంలో 1080 మంది ప్రయాణికులు వున్నారు.