ప్రకాశంలో భూకంపం
అక్షరవిజేత,ఒంగోలు బ్యూరో:
ప్రకాశం జిల్లాలో శనివారం డిసెంబర్ 21న ఉదయం భూమి కొన్ని క్షణాలు కంపించింది. జిల్లాల్లోని శంకరాపురం, పోలవరం, పాసుగుగల్లీ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రావడంతో అక్కడి జనాలు ఇళ్లు, ఆఫీసుల నుంచి పరుగులు తీశారు. ఈ ప్రకంపనల ప్రభావం పొరుగున ఉన్న మండ్లమూరు, వెంపాడు, మారెల్ల, తూర్పు కంభం పాడు ప్రాంతాల్లో కూడా కనిపించింది.మండ్లమూరు ప్రాంతంలో భూమి కంపించడంతో స్కూల్ లో నుంచి విద్యార్థులను ఖాళీ చేయించారు. భూ ప్రకంపనలు అనుభూతి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసుల నుంచి పరుగులు తీసి కొంత సమయం బయటే ఉన్నట్లు తెలిసింది. భూకంప ప్రభావం స్వల్పంగా ఉండడంతో ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు చేస్తున్నారు. అయితే భూకంప కేంద్రం ఎక్కడ ఉన్నది అనేది తెలియరాలేదు.
తెలంగాణలో భూకంపం వచ్చిన 17 రోజులకు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రకంపనలు
ఇదే నెల 17 రోజుల క్రితం అంటే డిసెంబర్ 4, 2024న తెలంగాణ లో కూడా భూకంపం వచ్చింది. రాజధాని హైదరాబాద్ తో పాటు పొరుగు ప్రాంతాల్లో కూడా భూమి 5.3 పాయింట్లు రిక్టర్ స్కేలు రేటింగ్ తో కంపించింది. భూకంపం గురించి సమాచారం అందించే నేషనల్ సెంటర్ ఫర్ సెయిస్మోలాజీ (ఎన్‌సిఎస్) ప్రకారం.. హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగులో భూ కంపం మొదలై హైదరాబాద్ వరకు దాని ప్రభావం కనిపించిందని ఎన్‌సిఎస్ తెలిపింది.జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా.. దేశంలో అయిదు సెయిస్మిక్ జోన్లను విభజించింది. ఈ జోన్లలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు జోన్ 2 లోకి వస్తాయి.
డిసెంబర్ 4న ములుగులో వచ్చిన భూకంప ప్రభావం ఉమ్మడి కృష్ణ జిల్లా వరకు కనిపించింది. నందిగామ, జగ్గయ్యపేట్, మైలవరం తో పాటు విజయవాడ, హనుమాన్ జంక్షణ్, మచిలీపట్నం, గుడివాడ, పెనుగంచిప్రోలు, కంచికర్ల, వీరులపాడు మండలాలకు వరకు భూమి కంపించింది. రాజుపేటలోని తిరువూరు మండలంలో అయితే భూకంపం కారణంగా ఒక ఇంటి గోడలు బీటలు వారింది.