నక్కపల్లి మండల అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తా
సీఎం చంద్రబాబు హామీ
అక్షరవిజేత నక్కపల్లి :
మండల సమస్యలపై టిడిపి సీనియర్ నేత కొప్పిశెట్టి వెంకటేష్ సీఎం కు వినతి కి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.రాష్ట్ర హోం వ్యవహారాల శాఖ మంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో మండల టిడిపి అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్ ఈ మేరకు గురువారం అమరావతిలోని సీఎం కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఇందులో మరమ్మతుకు వచ్చిన గ్రామీణ రహదారుల పునరుద్ధరణ, గ్రామాల్లో కొత్త రహదారులు సహా డ్రైనేజీ నిర్మాణం, మండల కేంద్రం నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మరింత అభివృద్ధి తో పాటు మెరుగైన వైద్య సదుపాయాల కల్పన తదితర సంక్షేమ పథకాలు చేపట్టాలని కోరుతూ మండల టిడిపి అధ్యక్షులు వెంకటేష్ సీఎంకు అందజేసిన వినతి పత్రంలో పేర్కొన్నారు.పరిశీలించిన మీదట మండల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు మండల టిడిపి సీనియర్ నాయకులు వెంకటేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్, నక్కపల్లి క్లస్టర్ ఇంచార్జ్ కొప్పిశెట్టి బుజ్జి,టిడిపి నాయకులు వంగలపూడి శ్రీనివాసరావు,గోసల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.