Friday, April 4, 2025
spot_img

భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న పుష్ప  ప్రదర్శనశాల

భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న పుష్ప  ప్రదర్శనశాల

అక్షరవిజేత,తిరుపతి :
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్బంగా  తిరుచానూరులోని శుక్రవారపుతోటలో ఏర్పాటుచేసిన పుష్ప ప్రదర్శనశాల భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.ఇందులో టీటీడీ ఉద్యాన విభాగం ఆధ్వర్యంలో ‘ హిరణ్యక్షుడనే రాక్షసుడిని సంహరించి భూదేవిని కాపాడుతున్న వరాహరూపంలో ఉన్న శ్రీమహావిష్ణువు, వాలి సుగ్రీవుల మధ్య జరిగే యుద్ధంలో చెట్టు చాటు నుండి వాలిని సంహరిస్తున్న రాముడు, శ్రీ రామ రావణ యుద్ధంలో వనరులతో యుద్ధం చేస్తున్న కుంభకర్ణుడు అనే రాక్షసుడి ప్రతిమలు ఏర్పాటు  చేశారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారు ఆరగించిన లడ్డును ముసలి అవ్వ రూపమున అన్నమయ్యకు అందిస్తున్న పద్మావతమ్మ, సీతాదేవి అన్వేషణలు శ్రీరామ లక్ష్మణుల సమక్షంలో లంకకు వారధి కడుతున్న వానరసైన్యం, ఎరుకుల సాని వేషంలో పద్మావతి దేవికి సోది చెబుతున్న శ్రీనివాసుడు, లక్క గృహం దహనం నుండి తల్లి కుంతీదేవితో సహా సోదరులను కాపాడుకొని తన భుజస్కందాలపై తీసుకొస్తున్న భీమసేనుడు, చిన్ని కృష్ణుడిని యమునా నది దాటిస్తున్న వసుదేవుడు రావణాసురుడిని సంహరిస్తున్న శ్రీరాముడు తదితర ప్రతిమలు  ఆకట్టుకుంటున్నాయి.వివిధ పుష్పాలు, కూరగాయలతో ఏర్పాటు చేసిన జంతువులు, పక్షుల ఆకృతులు భక్తులను విశేషంగా ఆకర్షించాయి.మైసూర్ కు చెందిన గౌరి గత 9 సంవత్సరాలుగా సైకిత శిల్పాన్ని తయారు చేస్తోంది, ఈ ఏడాది అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారి సైకిత శిల్పాన్ని రూపొందించారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles