*గౌలిదొడ్డిలో సందీప్ బిల్డర్ హవా,,?*
*అక్రమ నిర్మాణాలకు ఆజ్యం పోస్తున్న సందీప్ బిల్డర్*
*అక్షరవిజేత,రాజేంద్రనగర్*
గండిపేట మండల్ నార్సింగి మున్సిపల్ పరిధి గౌలిదొడ్డి గ్రామంలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు.111 జీవోకు తూట్లు పొడుస్తూ భారీ భవన నిర్మాణాలకు తెర లేపాడు సందీప్ అనే బిల్డర్.ఒక సామాన్య వ్యక్తిగా గౌలిదొడ్డిలో ప్రవేశించి బిల్డింగ్ కాంట్రాక్ట్ పనులను చేపడుతూ కోట్లకు పడగలెత్తాడు.గౌలిదొడ్డిలో ఎవరైనా భవన నిర్మాణం చేపట్టాలంటే ముందుగా సందీప్ తలుపు తట్టాల్సిందే. ఆయా కనుసన్నల్లోనే అక్రమ భవనాలు వెలుస్తున్నాయి.స్థలం యజమానులతో సందీప్ మొదట ఒక బేరానికి వస్తాడు.అది కుదిరితే సరే,లేదంటే భవన నిర్మాణం పనులను వేరే బిల్డర్ లకు ఇవ్వకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. ఆయనకు భవన నిర్మాణం కాంట్రాక్ట్ పనులను ఇవ్వకుంటే అంతే సంగతులు,ఇస్తే సరే.బేరం కుదిరిందనుకోండి, అధికారులను స్థానిక ప్రజా ప్రతినిధులను అటువైపు రానివ్వకుండా తానే అందర్నీ మేనేజ్ చేస్తా అని ఒప్పందం కుదిర్చుకుని బిల్డింగ్ యజమానుల దగ్గర ప్రతి ఒక్కరి పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తూ అందినకాడికి దండుకుంటూ తన ఖజానా నింపుకుంటున్నాడని స్థానికంగా బహిరంగ ఆరోపణనలు వినిపిస్తున్నాయి.అంత ఇచ్చుకోలేమని కొద్దో గొప్పో ఇచ్చుకుంటామని ప్రాదేయా పడి తనకే కాంట్రాక్ట్ పనులను అప్పగిస్తారు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు బిల్డింగ్ మొదలుపెడితే సెల్లార్ నుండి ఏడవ అంతస్తు వరకు నిర్మాణాలు చేపడతాడు..ఇది పక్కన పెడితే అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో అధికారులు విఫలం చెందుతున్నారని ఏదైనా పత్రికల్లో కానీ టివి ఛానెల్లో కానీ ప్రసారం అయితే నార్సింగి మున్సిపల్ అధికారులు మంది మర్భాలంతో గౌలిదొడ్డి చేరుకుని అక్రమ భవనాలను కూల్చివేస్తారు.అప్పడు సందీప్ సిన్ లో కనిపించడు.
యజమానులు తమ సమస్యలను వివరిద్దామని ఫోన్ చేస్తే అందుబాటులోకి రాకుండా ఉంటున్నాడని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అక్రమ భవనాలను నిర్మించకుండా సందీప్ బిల్డర్ కు అడ్డుకట్ట వేయాలంటున్నారు అక్కడి బాధితులు.
సందీప్ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని సదరు బిల్డింగ్ యజమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.