ప్రతి ఒక్క రైస్ మిల్లర్లు ప్యాడిని దిగుమతులు చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.
అక్షరవిజేత,జగిత్యాల :
ప్రస్తుత సీజన్ లో ప్రతి ఒక్క రైస్ మిల్లర్లు ప్యాడిని దిగుమతులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆదేశించారు.మంగళవారం రోజున కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా రైస్ మిల్లర్ల తో సమావేశం నిర్వహించారు. ముందుగా రా రైస్ మిల్లర్లు, బాయిల్డ్ రైస్ మిల్లర్లు తమ యొక్క సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రూల్స్ ప్రకారం 10% బ్యాంకు గ్యారంటీ రైస్ మిల్లులకు యధావిధిగా వర్తిస్తుందని తెలిపారు. గతంలో లీడ్ బ్యాంకు మేనేజర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం లో భాగంగా వారు చెప్పిన రూల్స్ ప్రకారం బ్యాంకు గ్యారెంటి వర్తిస్తాయని తెలిపారు.అలాగే రైస్ మిల్లర్ గతంలో చెల్లించాల్సిన బకాయి బిల్లును చెల్లింపు చేస్తామని హామీ ఇచ్చారు. అందరి సహకారంతో ప్యాడి దిగుమతి కెపాసిటీ బట్టి మిల్లర్లు రైతులకు ప్రభుత్వానికి సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. ఎస్.లత,డీసీవో డీఎంవో, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.