ఆశా వర్కర్ ను వేధిస్తున్న ఏఎన్ఎం పై చర్యలు తీసుకోవాలి
ఆశా వర్కర్స్ నేత ఏ కమల డిమాండ్
అక్షరవిజేత,నందిగామ :
నందిగామ మండలం లింగాలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో లింగాలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎ.కమల మాట్లాడుతూ లింగాలపాడు పీహెచ్సీ పరిధిలో అంబారుపేట వెల్నెడ్ సెంటర్లో వనజ నాగమణి అనే ఆశ వర్కర్లు గత 16 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని ఐదు సంవత్సరాల నుండి అంబారుపేట ఏఎన్ఎం ఎస్ విజయ్ కుమారి ఆశా వర్కర్లను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ సమస్యపై అనేకసార్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ దృష్టికి జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లారని అయినా సమస్య పరిష్కారం కాలేదని ప్రాథమిక విచారణ జరిపి చేతులు దులుపుకోవడం సరైనది కాదన్నారు. ఇప్పటికైనా కమిటీ వెంటనే ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు చేసి పూర్తి విచారణ జరిపి సంబంధిత ఏఎన్ఎం గారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. లేనిపక్షంలో అక్టోబర్ 18 వ తేదీ తర్వాత ఏ రోజు నిండు అయినా లింగాలపాడు పీఏసీ పరిధిలోని ఆశలు తమ విధులను బహిష్కరించి ఆందోళన చేస్తారని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వక హామీల్లో భాగంగా ఆశ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మెడికల్ మేటర్నిటీ సెలవులు సాధారణ సెలవులు రికార్డులు నాణ్యమైన ఫోన్లు సిములు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని. వయోపరిమితి పెంచాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం. నవంబర్ 18 వ తారీఖున రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆశ వర్కర్లు పాల్గొని జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కటారపు గోపాల్ మరియు సిఐటియు నాయకులు కరి వెంకటేశ్వరరావు ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు వనజ, తిరుమల దేవి, నాగమణి,కవిత, తదితరులు పాల్గొన్నారు.