సర్వం కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకున్న
ఆదివాసీ మెడికల్ మరియు ఎంప్లాయిస్ అసోసియేషన్
అక్షర విజేత జీలుగుమిల్లి
జీలుగుమిల్లి మండలం పరిధిలోగల చంద్రమ్మ కాలనీ గ్రామంలో నిన్న జరిగిన అగ్ని ప్రమాద సంఘటనలో కోర్స. రమేష్ ఇల్లు కాలిపోవడం వలన పూర్తిగా సర్వం కోల్పోవడం జరిగింది. రమేష్ తన భార్య ఇద్దరు సర్వం కోల్పోయారు.ఈ కుటుంబానికి ఆదివాసి మెడికల్ అండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ఉప అధ్యక్షులు మీడియం. సువర్ణ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు సున్నం.శ్రీరాములు దొర.వారి యొక్క కుటుంబనకు బట్టలు,దుప్పట్ల, వంట సామాగ్రి, సింగిల్ కట్ మంచం, నూనె 5 లీటర్లు , ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే వేలేర్పాడు మండలం మేడేపల్లి తెలుగుదేశం నాయకులు,చాపర్ల శ్రీనివాసరావు, పద్దం. రమేష్, కుంజా. విజయ్ వారికి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కూరగాయలు మరియు కేజీ మంచి నూనె అందజేయడం జరిగింది. వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సున్నం. శ్రీరాములు దొర డిమాండ్ చేశారుఈ కార్యక్రమంలో గ్రామస్తులు మరియు హెల్త్ అసిస్టెంట్ కూరం. ప్రసాద్, phn k. నాగమణి, HV పొట్ట నాగరత్నం, HV ఆదిలక్ష్మి, ఏఎన్ఎం, ఆశాలు, తదితరులు పాల్గొన్నారు.