Friday, April 4, 2025
spot_img

నిమ్స్ లో విద్యార్దులను పరామర్శించిన మంత్రి కొండ సురేఖ

నిమ్స్ లో విద్యార్దులను పరామర్శించిన మంత్రి కొండ సురేఖ

అక్షరవిజేత,హైదరాబాద్ :

 

హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు మహాలక్ష్మి, జ్యోతి, శైలజలను మంత్రి కొండా సురేఖ పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి ఆరోగ్యం పట్ల ప్రభుత్వం శ్రద్ధవహిస్తుందని భరోసానిచ్చారు. వారిని ఓదార్చారు. విద్యార్థుల ఆరోగ్యపరిస్థితిని నిమ్స్ డైరక్టర్ బీరప్ప, హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్, నెఫ్రాలజీ గంగాధర్ లు మంత్రి గారికి సునిశితంగా వివరించారు. ఫుడ్ పాయిజనింగ్ తో తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు వారు మంత్రికి వివరించారు. వారికి అందిస్తున్న చికిత్స వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పేషెంట్ల కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా వసతి, భోజన సదుపాయాలను కల్పించాలని నిమ్స్ డైరక్టర్ కు మంత్రి సురేఖ సూచించారు.  ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, చికిత్స పొందుతున్న ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు విద్యార్థుల ఆరోగ్యం స్థిమితపడుతండగా, మరొక విద్యార్థికి ఇంటెన్సివ్ చికిత్సను అందిస్తున్నారని మంత్రి తెలిపారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులు హాస్టల్ లో పెట్టిన ఆహారంతో అస్వస్థతకు గురి కాలేదని,  ఇంటి నుంచి తెచ్చుకున్న తినుబండారాలు తినడం వలనే అస్వస్థతకు గురయ్యారని, అదే ఆహారాన్ని తిన్న సిబ్బంది ఆరోగ్య పరిస్థితి బాగానే వున్నట్లు అధికారులు తెలిపినట్లు మంత్రి సురేఖ వివరించారు.   ఏదేమైనప్పటికీ పరీక్షకు పంపిన ఆహారపదార్థాల  రిపోర్టులు వచ్చాక ఈ సంఘటనకు బాధ్యులు అధికారులని తేలితే వారి పై క్రమశిక్షణా  చర్యలు తీసుకుంటామని మంత్రి సురేఖ తేల్చి చెప్పారు.  చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు ఏదో సాకు దొరికింది కదా అని  ప్రభుత్వం పై బురదజల్లేలా మాట్లాడారని మంత్రి అన్నారు. వాస్తవావస్తవాలు తెలుసుకోకుండా బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం తగదని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హాస్టళ్ళ నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. విద్యారంగ బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలతో కార్యాచరణ ప్రణాళికను అమలుచేస్తున్నదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ళ ఏర్పాటులో ఎంతో నిబద్ధతతో ముందుకు వెళుతున్నారని మంత్రి అన్నారు. విద్య, వైద్యం, అభివృద్ధి, సంక్షేమ రంగాల పై కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎంతో కచ్చితమైన ప్రణాళికతో పనిచేస్తున్నదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని, అర్థరహితంగా ప్రభుత్వం పై బురద జల్లడమే పనిగా పెట్టుకోవద్దని సూచించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles