Thursday, April 3, 2025
spot_img

నింద’ సినిమాతో అందరినీ ఆకట్టుకునేందుకు రాబోతున్న హీరో వరుణ్ సందేశ్

నింద’ సినిమాతో అందరినీ ఆకట్టుకునేందుకు రాబోతున్న హీరో వరుణ్ సందేశ్
టాలెంటెడ్ హీరో వరుణ్ సందేశ్ ప్రస్తుతం ‘నింద’ సినిమాతో అందరినీ ఆకట్టుకునేందుకు రాబోతున్నారు. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 21న రాబోతోంది. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే వదిలిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, పాటలు అన్నీ కూడా సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక మైత్రీ మూవీస్ ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తుండటంతో అంచనాలు మరింతగా పెరిగాయి. విశ్వక్ సేన్, సందీప్ కిషన్ ఈ మూవీ ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ అయితే సమాజాన్ని ప్రశ్నించేలా, తట్టి లేపేలా ఉంది. ‘మంచోడికి న్యాయం జరుగుతుందని నమ్మకం పోయిన రోజు.. ఒక సమాజం చనిపోయినట్టు’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌లో.. ‘మంచివాడి కోపం ఒక వినాశనానికి ఆరంభం’.. ‘అబద్దాన్ని బలంగా చెప్పినంత మాత్రానా నిజం అయిపోదు’..  ‘బలవంతుడిదే రాజ్యం అని అనుకోవడానికి మనమేమీ అడవుల్లో బతకడం లేదు’.. అంటూ సాగిన డైలాగ్స్ బాగున్నాయి.  అమ్మాయి మీద అఘాయిత్యం చేసిన కేసు చుట్టూ కథ తిరుగుతుండటం, అసలు నేరస్థుడు ఎవరు? అని హీరో చేసే ఇన్వెస్టిగేషన్ ఉత్కంఠ భరితంగా ఉంది. చూస్తుంటే ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంది. రమీజ్ కెమెరా వర్క్, సంతు ఓంకార్ ఆర్ఆర్ ట్రైలర్‌లో చాలా బాగా హైలెట్ అయ్యాయి.
శ్రేయారాణి, ఆనీ, క్యూ మధు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్యకుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో శ్రీరామసిద్ధార్థ కృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు
రమీజ్ నవీత్ సినిమాటోగ్రాఫర్‌గా, అనిల్ కుమార్ ఎడిటర్‌గా పని చేశారు. మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న ఈ సినిమా జూన్ 21న రాబోతోంది.
నటీనటులు: వరుణ్ సందేశ్, అన్నీ, తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై, శ్రేయా రాణి రెడ్డి, క్యూ మధు, శ్రీరామ్ సిద్దార్థ కృష్ణ, రాజ్ కుమార్ కుర్ర, దుర్గా అభిషేక్ తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్
రచయిత, దర్శకుడు మరియు నిర్మాత: రాజేష్ జగన్నాధం
సంగీతం: సంతు ఓంకార్
కెమెరామెన్: రమీజ్ నవీత్
ఎడిటింగ్: అనిల్ కుమార్
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ
కాస్ట్యూమ్ డిజైనర్: అర్చన రావు
సౌండ్ డిజైనర్: సింక్ సినిమా
PRO: ఎస్ఆర్ ప్రమోషన్స్ (సాయి సతీష్)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles