కాగజ్ నగర్లో పులిపిల్లలతో పెద్దపులి సంచారం కలకలం
అక్షర విజేత కాగజ్ నగర్ ప్రతినిధి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో పెద్దపులి తన పిల్లలతో కలిసి
సంచారం చేయడం కలకలం రేపింది. కాగజ్ నగర్ మండల సమీపంలోని గోంది అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. పిల్లలతో కలిసి స్థావరం ఏర్పాటు చేసుకుని
సమీప ప్రాంతాల్లో సంచరిస్తుందన్నారు. దీంతో సమీప మండలాల ప్రజలు భయభాంతులకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు భద్రత చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.