*ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్*
అక్షరవిజేత, వికారాబాద్ ప్రతినిధి
వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని రిబ్బన్ కట్ చేసి తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సౌకర్యార్థం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, డి ఎం హెచ్ ఓ పాల్వన్ కుమార్, జెడ్పి వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్, ఆర్డిఓ వాసుచంద్ర, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ యాదవ్, సీనియర్ నాయకులు నరోత్తంరెడ్డి, సుభాష్, సిరాజుద్దీన్, మాణయ్య, దుర్గం చెరువు శ్రీనివాస్, ఎన్కెతల శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.