ఐక్యత పోరాటాల వల్లే కార్మిక సమస్యలకు పరిష్కారం.
అక్షర విజేత మందమర్రి
ఈరోజు సిఐటియు 54 సంవత్సరాలు పూర్తి చేసుకుని 55వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కెకె 5. గనిపై యువ పిట్ సెక్రటరీ సంకే.వెంకటేష్ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బ్రాంచ్ అధ్యక్షులు వెంకటస్వామి మాట్లాడుతూ భారత దేశంలో ఉన్న కార్మికులను కార్మిక సంఘాలను ఐక్యం చేసి యాజమాన్యంపై ఐక్య పోరాటాలను చేయించడమే లక్ష్యంగా గత 54 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేస్తూ కార్మిక వర్గాన్ని చైతన్య వంతం చేసుకుంటూ ముందుకు పోతున్నదని తెలిపారు.ముఖ్యంగా కార్మిక సంఘాల మధ్య వైరుధ్యాలను తొలగించి కార్మిక సంఘాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి సిఐటియు కృషి చేస్తున్నదని భవిష్యత్తులోనూ అలాగే కృషి చేస్తూ ఐక్య పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్మిక సంఘాలు కార్మికుల శ్రేయస్సుకోసం కాకుండా ప్రభుత్వాలకు మద్దతుగా పనిచేయడం సరికాదని అలాంటి కార్మిక సంఘాల వల్ల కార్మిక వర్గానికి నష్టం జరుగుతున్నదని ప్రస్తుతం ఉన్న కార్మిక సంఘాల నాయకులు పూర్తిగా కష్టించి పనిచేయడానికి వెనుకాడుతూ పై పైన తిరుగుతూ ఉండటం మానుకొని కార్మికులతో కలిసి పని చేసుకుంటూ కార్మిక భాదాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ యాజమాన్యంపై ఒత్తిడి చర్చి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. గనులలో జరుగుతున్న ప్రమాదాలు తమ వంతు పాత్ర పోషించకుండా యాజమాన్యానికి అనుకూలంగా ఉండడం వలన జరుగుతున్నాయని అటువంటి కమిటీలలో ఉన్న నాయకులు బాధ్యతగా వ్యవహరిస్తే ప్రమాదాలు జరగవని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోరుక.వెంకటేష్, దొండ.నవీన్ ఆదర్ష్, శ్రీనివాస్, శివకుమార్, చైతన్య రెడ్డి, రాంబాబు, మరియు గని కార్మికులు పాల్గొన్నారు.