నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
అక్షర విజేత కాగజ్ నగర్ ప్రతినిధి
విత్తన డీలర్లు నకిలీ విత్తనాలు విక్తయించినట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో పాత్రికేయులతో సమావేశంలో కలెక్టర్ పాల్గోని
మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల 38 వేల ఎకరాల్లో రైతులు పత్తిని పండిస్తున్నారని తెలిపారు. జిల్లాలో రైతులకు జూన్ 25 వరకు విత్తనాలు డీలర్ల వద్ద లభిస్థాయని అన్నారు.