నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా పకడ్బంది చర్యలు
జిల్లా కలెక్టర్ ఎం .మను చౌదరి
అక్షర విజేత సిద్దిపేట
నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా పకడ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టర్ కార్యాలయంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్. అనురాధ తో కలిసి నకిలీ విత్తనాల నియంత్రణపై వ్యవసాయ, పోలీస్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాలతో ఏ ఒక్క రైతు కూడా మోసపోకుండా వ్యవసాయ మరియు పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో దాడులు నిర్వహించి నకిలీ విత్తనాలను అరికట్టాలని అన్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖల అధికారులు టాస్క్ ఫోర్స్ బృందాలుగా ఏర్పడి ప్రభుత్వ అనుమతి లేకుండా, కంపెనీ లేబుల్ లేకుండా గ్రామాల్లో తిరుగుతూ ధర తక్కువ, అధిక దిగుబడులు వస్తాయని చెబుతూ రైతులను మోసగించే వ్యాపారులు మరియు కంపెనీ అనుమతులు లేకుండా, రైతులకు బిల్లులను ఇవ్వకుండా నకిలి విత్తనాలను అమ్మే షాపులపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలని అన్నారు. అలాగే రైతులకు నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండేల అవగాహన కల్పించాలని అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి నకిలీ విత్తనాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించాలని అన్నారు.జిల్లాలో సరిపడు జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని రైతులెవరు జీలుగా విత్తనాల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.మిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్. అనురాధ మాట్లాడుతూ జిల్లాలో వరి, పత్తి ప్రధాన పంటలు కాబట్టి వాటిలో మకిలి విత్తనాలు అమ్మే అవకాశం ఉన్నందున పోలీస్ మరియు వ్యవసాయ శాఖ అధికారులతో 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ర్యాండంగా విత్తన షాపులు మరియు గోడౌన్లలో దాడులు నిర్వహించడం జరిగిందని ఈ సంవత్సరం ఇప్పటికీ జిల్లాలో నకిలీ విత్తనాల కేసును నమోదు చేయలేదని అన్నారు. రానున్న 15 మరియు 20 రోజులు చాలా ముఖ్యమైనవని నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నకిలీ విత్తనాలను కలిగి ఉన్న లేదా రైతులకు విక్రయించిన సంబంధిత షాప్ ల యజమానులపై పిడి యాక్ట్ నమోదు చేస్తామని అన్నారు.అనంతరం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వ్యవసాయ అధికారులు, మండల స్టాటిస్టికల్ అధికారులు, హార్టికల్చర్ అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల మూలంగా పంట నష్టం కలిగినప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన చాలా ఉపయోగంగా ఉండి రైతులకు ఆర్థిక చేయూతనందిస్తదని ఈ స్కీం లో రైతులందరినీ చేర్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వానాకాలం పంట కాలంలో వరి, మొక్కజొన్న, పత్తి, కందులు, టమాట, మ్యాంగో, ఆయిల్ ఫామ్ తదితర పంటలకు జిల్లాలో ఇన్సూరెన్స్ అవకాశము ఉందని దానిని రైతులకు సద్వినియోగం చేయాలని అన్నారు. పంట నష్టం కలిగినప్పుడు రైతులకు మ్యాగ్జిమం లబ్ధి జరిగేలా అధికారులు చూడాలని అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 11105 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేయడం జరుగుతుందని, ఈ సంవత్సరం నిర్దేశించిన 7717 ఎకరాల సాగు లక్ష్యం చేరేలా రైతులను మోటివేట్ చేసి రైతులతో డిడి కట్టించాలని అన్నారు. అదేవిధంగా ఈజీఎస్ ద్వారా ఆయిల్ ఫామ్, మునగ, మల్బరీ తదితర పంటలు వేసి రైతులు రాయితీ పొందేలా చూడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ మరియు సెరికల్చర్ అధికారి సువర్ణ, సిపిఓ చంద్రశేఖర్ రాజు, వ్యవసాయ శాఖ ఎడి లు, మండల వ్యవసాయ అధికారులు, ఏఈవోలు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.