*ప్రతి ఒక్కరూ దైవ భక్తి కలిగి ఉండాలి — చెరుకు లక్ష్మారెడ్డి*
అక్షర విజేత గజ్వెల్ :(మర్కుక్ )
ప్రతి ఒక్కరూ దైవ భక్తి కలిగి ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చెరుకు లక్ష్మారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వరదరాజ పూర్ లోని శ్రీ హనుమాన్ దేవాలయం వద్ద శనివారం హనుమాన్ మాల ధారణ స్వాములకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చెరుకు లక్ష్మారెడ్డి రుక్మిణి దంపతుల ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమాన్ స్వామి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని హనుమాన్ మాల ధారణ వల్ల అంతా మంచి జరుగుతుందని హనుమాన్ మాల ధారణ చేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్న హనుమాన్ స్వాములు అభిందనేయులు అని ప్రతి ఒక్కరూ దైవ భక్తి కలిగి ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్ర శేఖర్, మర్కుక్ మండల ఆర్యవైశ్య సంఘం యువజన నాయకుడు అభిలాష్,హనుమాన్ స్వాములు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.