బడుగు బలహిన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది
-రిజర్వేషన్ల విషయంలో మోడీది నిరంకుశ వైఖరీ
-కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి
అక్షర విజేత, నిజామాబాద్ సిటీ : దేశంలో ఇండియా కుటామి అధికారంలోకి వస్తే బడుగు బలహిన వర్గాలకు (ఎస్సీ, ఎస్టీ, బీసీ) కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, రిజర్వేషన్ల విషయంలో ప్రధాని మోడీ నిరంకుశ వైఖరీ ప్రదర్శిస్తున్నారని ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావటానికి మత కల్లోహలను రెచ్చగొడుతుందని ఆరోపించారు. ఈ డబ్ల్యూఎస్ లో ముస్లింలకు ఉన్న పది శాతం రిజర్వేషన్లను తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీ లకు ఇస్తానని మోడీ అనడం ఆయన బాధ్యత రాహిత్యానికి నిదర్శనం అన్నారు. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ లను తొలగించే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. దేశంలో ఉన్న అన్ని వర్గాలలో వారికి ఉన్న హక్కులను హరించి వేసి, కేవలం వారి స్వార్థ రాజకీయాల కోసమే మోడీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా దళితుల హక్కులను కాలరాస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు మోడీకి ఉందా అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ హక్కులను తప్పకుండా కాపాడి వారికి కావాల్సిన మౌలిక వసతులు హక్కులు కల్పించడమే తమ ప్రధాన ఎజెండా అని అన్నారు. ప్రధానంగా దేశంలో ముస్లింలకు బూచి చూపి దేశాన్ని చీల్చే ప్రయత్నం బిజెపి చేస్తుందని విమర్శించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడుగు గంగాధర్, మైనారిటీ నాయకులు జావిద్ అక్రమ్, ఎన్.ఎస్.యు.ఐ జిల్లా అధ్యక్షులు వేణు రాజ్, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు రామర్థి గోపి, పంచ రెడ్డి చరణ్ తదితరులు పాల్గొన్నారు.