*ప్రజలకు సురక్షిత తాగు నీరు కూడా సరఫరా చేయలేరా?*
*ప్రజలు ఆనారోగ్యం బారిన పడిన స్పందించరా?*
*జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి*
అక్షర విజేత చిలకలూరిపేట
చిలకలూరిపేట:సురక్షితమైన తాగునీరు సరఫరా చేయటంలో వైసీసీ ప్రభుత్వం ఘరంగా విఫలమైందని, కాలం చెల్లిన తాగునీటి పైపులు ప్రజలకు ప్రాణసంకటంగా మారుతున్నాయని జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి ఆరోపించారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాలాజి మాట్లాడుతూ తాగునీటి కుళాయి కనెక్షన్లకు మీటర్లు బిగించడం, ఛార్జీల పెంపుపై ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో లేదని మండి పడ్డారు. దశాబ్దాల కిందట ఏర్పాటైన తాగునీటి పైపులైన్ల స్థానంలో కొత్తవి ఏర్పాటుపై ఐదేళ్లలో తీసుకున్న లేవన్నారు. దీంతో గ్రామాల మాట దేవుడెరుగు పట్టణాలు, నగరాల్లో సురక్షిత నీటి సరఫరా కలగా మిగిలిందన్నారు. పలు పట్టణాల్లో తాగునీరు సరఫరా అత్యధిక చోట్ల పైపులు మురుగు కాలువల్లో, వాటికి పక్కనే ఉండటంతో నీరు కలుషితమవుతోందని ఆరోపించారు. . దీంతో రాష్ట్రంలోని పలు పట్టణాలు, నగరాల్లో కలుషిత నీటితో ఏటా అతిసారం, డయేరియా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయని ఆరోపించారు.
*ప్రజలు ఆనారోగ్యం బారిన పడుతున్నా పట్టించుకోరా?*
ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కలుషిత నీటి వలన ప్రజలు ఆనారోగ్యం బారిన పడ్డారని బాలాజి పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కలుషిత నీరు తాగి గుంటూరులో ముగ్గురు చనిపోయారని,. 200 మందికిపైగా అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చేరారని గుర్తు చేశారు. అప్పట్లోనే స్పందించకపోవడంతో ఇప్పుడు విజయవాడ మొగల్రాజపురంలో కలుషిత జలాలకు రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ప్రాంతంలో మరో 26 మంది వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల్లో చేరారని పేర్కొన్నారు. మీడియాలో వార్తలు రావటం, ప్రతిపక్షాలు స్పందించటంతో అధికారులు రెండు రోజులు హాడావిడి చేసి ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలివేస్తున్నారని విమర్శించారు.
*శుభ్రత మరిచిన అధికారులు*
తాగునీటి కలుషితానికి తుప్పుపట్టిన పైపులైన్లు ఒక కారణమైతే.. రిజర్వాయర్లు సరిగా శుభ్రం చేయకపోవడం మరోక కారణమని బాలాజి ఆరోపించారు . నగరాలు, పట్టణాల్లో ఉన్నన రిజర్వాయర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్న ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదని వెల్లడించారు. . నీటి శుద్ధికేంద్రాల నుంచి వచ్చే నీటిని రిజర్వాయర్ల ద్వారా ఇళ్లకు సరఫరా చేస్తుంటారని, వీటిలో నాచు, బురద పట్టకుండా ఆరు నెలలకోసారైనా శుభ్రం చేయాల్సి ఉంటుందన్నారు. మరోవైపు నీటి ఎద్దడి ఉన్న శివారు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీరు కూడా కలుషితమౌతుందన్నారు. వీటిని సక్రమంగా శుభ్రం చేయకపోవడం వల్ల నీరు కలుషితంగా మారుతుందన్నారు. వెంటనే అధికారులు తాగునీటిని పూర్తి స్థాయిలో శుభ్రం చేసి, కలుషితంగా కాకుండా సరఫరా చేయాలని బాలాజి డిమాండ్ చేశారు.