బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి దారుణ హత్య
రాష్ట్ర మంత్రి హస్తముందని ఆరోపిస్తున్న బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి![]()
శ్రీధర్ రెడ్డి హత్య కేసును సిబిఐతో ఎంక్వయిరీ చేయించాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్
అక్షర విజేత వీపనగండ్ల/చిన్నంబావి:
చిన్నంబావి మండల పరిధిలోని లక్ష్మిపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డిని రాత్రి 12 గంటల సమయంలో హత్య చేయడం జరిగింది. ఈ హత్య వెనకాల రాజకీయ హస్తముందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి హత్య జరిగిందని తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి,రంగినేని అభిలాష్ రావు ఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా సాక్షాత్తు రాష్ట్ర మంత్రి హస్తముందని ఆరోపణ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిని బర్తరఫ్ చేసి న్యాయమైన ఎంక్వయిరీ చేయాలని బిఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామని వారు అన్నారు. శ్రీధర్ రెడ్డికి వ్యక్తిగతంగా ఎలాంటి తగాదాలు లేవు. ఈ చుట్టుపక్కల గ్రామంలో అతని మంచితనం ఏంటి అనేది తెలుసుకోండి అని మాజీ ఎమ్మెల్యే అన్నారు. రాజకీయపరంగా శ్రీధర్ రెడ్డిని ఎదుర్కోలేక నిన్న రాత్రి 12 గంటల సమయంలో కరెంటు ఎల్సి తీసుకొని ఈ విధమైన భౌతిక దాడులకు పాల్పడడం చాలా బాధాకరమైన విషయమని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎన్నికలైన వెంటనే ఇది రెండో హత్యా అని అన్నారు. హత్యల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము అదే విధంగా డీజీపీకి కలిసి తెలపడం జరిగిందని అన్నారు. నాలుగు రోజులు గడవక ముందుకే ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని ఆవేదన చెందారు. నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి అధికార వ్యవస్థపై నమ్మకం లేదు. కాబట్టి శ్రీధర్ రెడ్డి హత్య పై సిబిఐ విచారణ జరిపించాలి. సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులపై ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ సరిగ్గా పని చేయవు. శ్రీధర్ రెడ్డి హత్య పై సిబిఐ ఎంక్వయిరీ చేయాలని బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. శ్రీధర్ రెడ్డి హత్యపై మండల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. వారి మరణం మాకు తీరనిలోటు అని కన్నీరు పెట్టారు. శ్రీధర్ రెడ్డి హత్యతో కొల్లాపూర్ నియోజకవర్గంలో బెదిరించాలని చూస్తున్నటువంటి వ్యక్తుల కుట్రలు చెల్లవని హెచ్చరించారు. బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు,నాయకులు శ్రీధర్ రెడ్డి ఆశయం కోసం పనిచేస్తారని తెలిపారు. కొల్లాపూర్ కు పట్టినటువంటి చీడను మళ్ళీ వదిలేస్తామని ఆయన అన్నారు. ఇలాంటి హత్యా రాజకీయాలు గతంలో చేసినటువంటి చరిత్ర ఎవరిదో కొల్లాపూర్ ప్రజలకు తెలుసని ఆయన హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్నటువంటి కొల్లాపూర్ నియోజక వర్గంలో దౌర్జన్యాలు,దాడులు ఇండ్లు కూలగొట్టడం వంటి పరిస్థితులు చేస్తున్నటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. భౌతిక దాడులను ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తులు మీ రాష్ట్ర క్యాబినెట్లో ఉంటే మీకు మీ ప్రభుత్వానికి మంచిది కాదని ఆయన విమర్శించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అన్ని సంఘటనలపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ లేదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వయిరీ చేయించాలి. శ్రీధర్ రెడ్డి హత్య కేసును సిబిఐ ఎంక్వయిరీ చేయాలని బిఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.