Friday, April 4, 2025
spot_img

పెళ్లికి తొందరపడడం లేదన్న ప్రభాస్ మహిళా అభిమానుల హృదయాలను గాయపరచడం ఇష్టం లేదని వ్యాఖ్య ఇన్‌స్టా పోస్టుపై స్పందన

పెళ్లికి తొందరపడడం లేదన్న ప్రభాస్ మహిళా అభిమానుల హృదయాలను గాయపరచడం ఇష్టం లేదని వ్యాఖ్య
ఇన్‌స్టా పోస్టుపై స్పందన

అక్షరవిజేత, సినిమా :

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ ఇటీవల పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘డార్లింగ్స్.. ఫైనల్‌గా నా జీవితంలోకి అత్యంత స్పెషల్ పర్సన్ రాబోతున్నారు. వెయిట్ చెయ్యండి’ అంటూ తన ఇన్‌స్టా స్టేటస్‌లో రాసుకొచ్చాడు. అది చూసిన అభిమానులు వదినమ్మ వచ్చేస్తోందంటూ సంబరాలు చేసుకున్నారు. ఆ వచ్చేది అనుష్కే అయి ఉంటుందన్న ప్రచారం జరిగింది. దీంతో ప్రభాస్ స్పందించక తప్పలేదు. తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలన్న తొందర ఏమీ లేదని, మహిళా అభిమానుల హృదయాలను గాయపరచాలనుకోవడం లేదంటూ తన రాబోయే సినిమా ‘కల్కి 2898 ఏడీ’ ఫంక్షన్‌లో చెప్పుకొచ్చాడు.

సినిమా ప్రమోషన్‌లో భాగంగానే ఆ పోస్టు పెట్టినట్టు డార్లింగ్ చెప్పుకొచ్చాడు. నాగ్ అశ్విన్ (కల్కి డైరెక్టర్) తనతో ఇలాంటి పనులు చేయిస్తూ ఉంటాడని పేర్కొన్నాడు. ఇక ‘స్పెషల్ పర్సన్’ అంటూ చెప్పింది సినిమాలోని బుజ్జి (కారు) గురించేనని చెప్పకనే చెప్పాడు. ఈ సినిమాలో బుజ్జికి సూపర్ పవర్స్ ఉంటాయి. బుజ్జి గురించి తనకు ఉద్వేగంగా ఉందని చెప్పాడు. మూడేళ్ల జర్నీ అద్భుతంగా గడిచిందని, దీనిని ప్రతి ఒక్కరు సిల్వర్ స్క్రీన్‌పై చూసి అనుభవించాల్సిందేనని వివరించాడు.

అమితాబ్ బచ్చన్, కమలహాసన్ వంటి దిగ్గజాలతో కలిసి నటించడం తనకు దక్కిన సువర్ణావకాశమని ప్రభాస్ పేర్కొన్నాడు. సినిమాల్లో కమలహాసన్ ధరించిన దుస్తులు కావాలని తల్లిదండ్రులను తరచూ అడిగేవాడినని ప్రభాస్ గుర్తుచేసుకున్నాడు. రూ. 600 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన కల్కి 2898 ఏడీ సినిమాను జూన్ 27న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles