ఈదురు గాలులతో భారీ నష్టం
కింద పడిపోయిన ట్రాన్స్ ఫార్మర్ లు ,విద్యుత్ స్తంభాలు, చెట్లు
విద్యుత్ సరఫరా లో తీవ్ర అంతరాయం
అక్షర విజేత కొండపాక
కొండపాక,మే 25 శుక్రవారం రాత్రి వచ్చిన ఈదురు గాలులకు భారీ నష్టం వాటిల్లింది. విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు సైతం కొట్టుకొని పోయి కింద పడిపోయాయి. దుద్దెడ, దర్గా , వెలికట్ట, రవీంద్ర నగర్ , కొండపాక తదితర గ్రామాల్లో కొద్దిసేపు మాత్రమే వీచిన భారీ ఈదురు గాలులకు చెట్లు నేలరాయి. ఆరేపల్లి శివారులోని కాటన్ మిల్లు షెడ్డు రేకులన్నీ లేచిపోయి
కిలోమీటర్ దూరంలో పడిపోయాయి. దర్గా సమీపంలో రైతు వ్యవసాయ క్షేత్రంలో గద్దెపై ఉన్న ఐదు వేల లీటర్ల ట్యాంకర్ కొట్టుకొని పోయింది ఆచూకీ కూడా లభించలేదు.
13 విద్యుత్ స్తంభాలు నేలకులాయి.టోల్ ప్లాజా సమీపంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లని నేలకులాయి.
విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో రాత్రింబవళ్లు సిబ్బంది కష్టపడి శనివారం మధ్యాహ్నం వరకు అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టారు.