*తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఫోన్ ట్యాపింగ్…*.
*బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ధాచారం కనకయ్య*
అక్షర విజేత గజ్వెల్ :-
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకు తీసుకు వచ్చిందని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో కేసీఆర్ పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని బిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు దాచారం కనకయ్య అన్నారు.
గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దాచారం కనకయ్య మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ లో కెసిఆర్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు ప్రజలను మభ్యపెట్టడానికి తప్ప మరొకటి లేదన్నారు . తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగావిఫలమైందనిఆరోపించారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయకుండా వాటిని పక్కన పెట్టీ రాష్ట్రం డెవలప్ చేయకుండా పేర్లు మారుస్తా లోగో మారుస్తా లోకల్ బీర్స్ పెడతా జిల్లాలు తీసేస్తా అని చెప్పడం సిగ్గుచేటు అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదేం రెండునాల్కల వైఖరి ఇదెక్కడి మూర్ఖపు ఆలోచన మీకు కాకతీయ కళాతోరణంపై ఎందుకంత కోపం చార్మినార్ చిహ్నం అంటే మీకెందుకంత చిరాకు అవి రాచరికపు గుర్తులు కాదు వెయ్యేళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు అని వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలు అని చెప్పారు. జయజయహే తెలంగాణ గీతంలో ఏముందో తెలుసా ? “కాకతీయ” కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ అధికారిక గీతంలో కీర్తించి అధికారిక చిహ్నంలోమాత్రంఅవమానిస్తారా.చార్మినార్ అంటే ఒక కట్టడం కాదువిశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ కు ఐకాన్ కాకతీయ కళాతోరణం అంటే.. ఒక నిర్మాణం కాదుసిరిసంపదలతో వెలుగొందిన ఈ నేలకు నిలువెత్తు సంతకం తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి వీటిని తొలగించడం అంటే తెలంగాణ చరిత్రను చెరిపేయడమే. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమే.మీ కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటక అధికారిక చిహ్నంలోనూ రాచరికరపు గుర్తులున్నాయి మరి వాటిని కూడా తొలగిస్తారా చెప్పండి అని డిమాండ్ చేశారు .భారత జాతీయ చిహ్నంలోనూ అశోకుడి స్థూపం నుంచి స్వీకరించిన మూడు సింహాలున్నాయి. జాతీయ పతాకంలోనూ దశాబ్దాలుగా ధర్మచక్రం ఉంది.వాటి సంగతేంటో సమాధానం చెప్పాలని సూచించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువులనూ పూడ్చేస్తారా ఒకప్పుడు రాచరికానికి చిహ్నంగా ఉన్న అసెంబ్లీని కూల్చేస్తారా ఇవాళ తెలంగాణ గుర్తులు మారుస్తామంటున్నారు. రేపు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సరిహద్దులూ కూడా చెరిపేస్తారని గత పదేళ్లుగా ప్రభుత్వ అధికారిక చిహ్నంపై యావత్ తెలంగాణ సమాజం ఆమోద ముద్ర ఉంది సబ్బండ వర్ణాల మనసు గెలుచుకున్న సంతకమూ ఉంది. రాజకీయ ఆనవాళ్లను తొలగించాలన్న కక్షతో రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని చెరిపేస్తే సహించం పౌరుషానికి ప్రతీకైన ఓరుగల్లు సాక్షిగా. మీ సంకుచిత నిర్ణయాలపై సమరశంఖం పూరిస్తాం.తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం అని అన్నారు.
మార్పు మార్పు అని తినే కంచంలో మట్టిపోస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఇలాగే కొనసాగితే తెలంగాణ 10 సంవత్సరాలు వెనక్కి పోవడం ఖాయమని ఆరోపించారు.
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర అవిర్భావ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని జూన్ 1న హైదరాబాద్ గన్ పార్క్ వద్ద భారీ జన సమూహంతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తామనిజూన్ 2 న గ్రామాల్లో మండల కేంద్రాల్లో బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.