నీలం మధుకు అండగా ఉంటాం


మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్.
అక్షర పటాన్చెరు
మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కు అండగా నిలుస్తామని తెల్లాపూర్ ముస్లిం సోదరులు అన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ పావని రవీందర్ ఆధ్వర్యంలో శుక్రవారం రంజాన్ పండుగను పురస్కరించుకొని కాలనీలోని 200 వందల ముస్లిం కుటుంబాలకు సేమియా,డ్రై ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పటాన్చెరువు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాగా కౌన్సిలర్ పావని రవీందర్ లు, ముస్లిం పెద్దలతో కలిసి నీలం మధును ఘనంగా సన్మానించారు. ముందుగా ముస్లిం పెద్దలు ప్రార్థనలు చేశారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ.. ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని పేర్కొన్నారు. రంజాన్ మాసంలో ముస్లిం కుటుంబాలకు చేయూతను అందించేందుకు ముందుకు వచ్చిన పావని రవీందర్ లను ఈ సందర్భంగా నీలం మధు అభినందించారు. ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంటుకు పోటీ చేసే అరుదైన అవకాశాన్ని అధిష్టానం తనకు కల్పించిందన్నారు. ప్రధాని ఇందిరా గాంధీ హయాంలోనే ఈ ప్రాంతంలో బిహెచ్ఎల్ తో పాటు అనేక కంపెనీలు, ఎయిర్ పోర్టు నెలకొల్పడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించారన్నారు. అందరూ సంఘటితమై తన గెలుపునకు కృషి చేయాలని ముస్లిం సోదరులు, పెద్దలు, పార్టీ నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సరిత శ్రీనివాస్ రెడ్డి, మంజుల,మున్సిపల్ టౌన్ ప్రెసిడెంట్ సిపి రెడ్డి, జిల్లా DCC వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యాం రావు,DCC జనరల్ సెక్రెటరీ సుధాకర్ రెడ్డి,అజీమ్, శ్యామ్ రావు,మహేందర్, ఖదీర్, రవిచారి, వాజిద్, రాజశేఖర్, మధు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.