ఈ సంవత్సరం చలివేంద్రమును ప్రారంభించిన మేముసైతం కమిటీ
అక్షర విజేత మందమర్రి
మందమర్రి పాత బస్టాండ్లో ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా జెడ్పీ చేర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి ప్రారంభోత్సవం చేసారు. 2015 నుంచి ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న మేముసైతం స్వచ్చంద సేవా సంస్థ ఈరోజు చలివేంద్రము ప్రారంభించింది. ఈరోజు దాతలుగా కీ//శే// చిన్నారి చుక్క సహస్ర జ్ణాపకార్ధం వారి కుటుంబ సభ్యులు సహకారంతో పెరుగన్నం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేముసైతం సంస్థ అధ్యక్షుడు బుబత్తుల శ్రీనివాస్ మరియు కమిటీ సభ్యులు ఎర్ర రాజు, జైన శ్రీదర్, ఉప్పలంచి చంద్రకాంత్, బోరిగం వెంకటేష్, ఈర్లపాటి సోమయ్య, కొండ శ్రీనివాస్ మరియు ప్రజలు అన్ని పార్టీలు నాయకులు పాల్గొన్నారు.