ప్రజల దాహం తీర్చాడానికి నీళ్ళు కరువాయే…
అక్షర విజేత,ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో:
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలంలోని కొమురవెల్లి గ్రామ పంచాయితీలోని ఎస్సీ కాలనీ వాడలో గత మూడు రోజులనుండీ నీళ్ళు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.నీళ్ళు రాకా ప్రజలు దాదాపుగా 2కిలోమీటర్ల దూరం నుంచి కాలి నడకన నడిచి బిందలల్లో తీసుకువచ్చి ప్రజలు వాళ్ల దాహాన్ని తీర్చుకుంటున్నారు.అసలే వేసవికాలం తాగడానికి నీళ్ళు లేకపోతే చావలసిన పరిస్థితి. ప్రజలకు ,పశువులకు తాగడానికి గుక్కెడు నీళ్లు కరువయ్యాయి.ప్రజలందరూ తమకు నీళ్ళు వాడలో రావాలని ఉన్నత అధికారులకు రెండు చేతులు జోడిస్తున్నామని మీడియా సమక్షంలో తెలిపారు.