నీటి కుళాయిల ద్వారా వృధాగా పోతున్న నీరు….
-పట్టించుకోని కాలనీవాసులు, సంబంధిత అధికారులు…
అక్షర విజేత.మరికల్/ధన్వాడ
నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో గజ్జలమ్మ గడ్డ మరియు రెండవ వార్డులో మిషన్ భగీరథ ద్వారా వస్తున్న నీటిని కాలనీవాసులు కుళాయిలకు గేటు వాల్ బిగించలేక వృధాగా వదులుతున్నారు.రాష్ట్రంలో వర్ష ప్రభావం పరిస్థితులు నెలకొనడం వల్ల జిల్లాల వారీగా కలెక్టర్ లు వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా నీటి సమస్యను నివారించడానికి చర్యలు చేపట్టాలని ఆదేశాలు చేస్తుంటే దానికి భిన్నంగా మరికల్ మండల కేంద్రంలో నీటిని వృధాగా వదులుతూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, మరోపక్క అశోక్ నగర్ కాలనీలో గత మూడు రోజుల నుండి నల్లులు రాకపోగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనచున్నారు, ఈ విషయమై సంబంధిత అధికారులు చొరవ తీసుకుని వృధాగా వెళుతున్న నీటి కొళాయిలకు గేటు వాల్ బిగించే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా మండల కేంద్రంలో అన్ని కాలనీలకు ప్రతిరోజు నీటిని సరఫరా చేయాలని ప్రజలు కోరుచున్నారు.ఈ విషయమై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుచున్నారు.