విమార్ట్ లో నిలువు దోపిడీ
అక్షర విజేత సిద్దిపేట్
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వి మార్ట్ లో వినియోగదారులపై నిలువ దోపిడి చేస్తున్నారు. వినియోగదారులు తాము నెలంతా కస్టపడి ఒకేసారి అన్ని వస్తువులు ఒకే చోట దొరుకుతున్నాయి కదా అని సూపర్ మార్కెట్ వస్తే వి మార్ట్ వాళ్లు ఆఫర్ వస్తువులపై చార్జీల మోత మోయుస్తూ మోసం చేస్తున్నారని వినియోగదారులు మండిపడ్డారు. ఆఫర్ వస్తువులను విడివిడిగా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇదే విషయంపై యాజమాన్యాన్ని ప్రశ్నించగా సిబ్బంది తప్పిదం వల్ల జరిగిందని యాజమాన్యం దురుసుగా ప్రవర్తిస్తున్నారని వినియోగదారులు వాపోయారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన వాళ్లలో మార్పు రాకపోవడం గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు వి మార్ట్ చేస్తున్న మోసాలను అరికట్టి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.