తాగునీటి ఎద్దడి నివారణకు సత్వర చర్యలు తీసుకోవాలి.
జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్
అక్షర విజేత అలంపూర్
వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామాలలో తాగునీటి కొరత లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
శుక్రవారం ఎర్రవల్లి మండలం పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో త్రాగు నీటి సరఫరాను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ గ్రామంలో ఎక్కడ కూడా త్రాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని అధికారులందరూ గ్రామాలలో తిరిగి త్రాగునీటి సమస్యలు ఉంటే గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. తిమ్మాపురం గ్రామా పంచాయితి ఎల్లో జోన్ లో ఉందని , గ్రామీణ నీటి సరఫరా వంద శాతం జరగాలన్నారు. చేతి పంపు మరమత్తులను ఈ నెల 7వ తేది వరకు పూర్తి చేయాలని , సింగిల్ ఫేస్ మోటార్స్ వంద శాతం పని చేయాలన్నారు. అత్యవసర సమయంలో రైతుల వ్యవసాయ బోర్ లను లీజుకు తీసుకొని మంచినీటి సరఫరా చేయాలని , క్లోరినేషన్ విధిగా చేయాలని సూచించారు . అందుకు అవసరమైన గ్రామపంచాయతీ నిధులను వినియోగించుకోవాలని , నిధుల కొరత ఉంటే ప్రత్యేక నిధులతో పనులు పూర్తి చేయాలన్నారు. గ్రామా పంచాయితిలో పనిచేస్తున్నటువంటి మల్టీపర్పస్ వర్కర్లకు వేతనాలు చెల్లించాలన్నారు. తాగునీటి పనులలో నిర్లక్ష్యం వీడి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.
అనంతరం గ్రామ పంచాయితి కార్యాలయంలో నీటి సరఫరాకు సంబంధించిన రిజిస్టర్లను, క్లోరోస్కోప్ ద్వారా నీటి స్వచ్ఛతను పరిశీలించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ శ్రీధర్ రెడ్డి, ఎంపీడీవో అజార్ మోహినుద్దీన్, ఎంపీ ఓ భాస్కర్ అధికారులు గ్రామ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.