ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
అక్షరవిజేత, ముస్తాబాద్
చిన్నకొడూర్ మండలం జక్కపూర్ గ్రామానికి చెందిన మంతూరి మహేష్ తండ్రి లింగయ్య, వయస్సు 37 సంవత్సరాలు వ్యక్తి జల్సా లకు అలవాటుపడి బైక్ దొంగతనం చేస్తూ, గతంలో ముస్తా బాద్ లో విశాలాక్షి మేస్ వద్ద నుండి గ్లామర్ బైక్, మాతృశ్రీ గార్డెన్ నుండి స్ప్లెండర్ బైక్ వేములవాడ తిప్పపుర్ నుండి స్కూటీ దొంగతనం చేయగా సీసీటీవీ , సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నేరస్తుని నుండి పై మూడు ద్విచక్ర వాహనాలు స్వాదినపరుచుకొని రిమాండ్ కు పంపనైనది. నేరస్తున్ని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ రాజశేఖర్, దామోదర్ లను ఎస్సై శేఖర్ రెడ్డి అభినందించారు.