అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
అక్షర విజేత, మంచిర్యాల ప్రతినిధి:
అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5.4 క్వింటాళ్ల రేషన్ బియ్యం, టాటా ఎస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రమేష్ తెలిపిన కథనం ప్రకారం పేదల కడుపు కొట్టి వారికి అందాల్సిన బియ్యాన్ని అక్రమమార్గాల్లో విక్రయిస్తున్న తాండూర్ మండలం ద్వారకా కాసిపేట్ గ్రామానికి చెందిన అప్స అక్షయ కుమార్, రెచిని రోడ్ కి చెందిన ని ఇందురి శ్రీనివాస్ అను ఇద్దరు పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్రకి తీసుకోని వెళ్లి అమ్ముతున్నట్లు గుర్తించి వారిని పట్టుకున్నట్లు తెలిపారు.