ఎన్నికల విధులపై శిక్షణ కార్యక్రమం
అక్షర విజేత సిద్దిపేట్
ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ.ఎన్నికల ప్రక్రియలో సెక్టార్ అధికారుల పాత్ర కీలకమైనది. మీకు జారి చేయబడిన పోలీంగ్ స్టేషన్లకు రూట్ మ్యాప్ ను తయారు చేసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం పోలీంగ్ స్టేషన్లో అన్ని సదుపాయాలు కల్పించాలి. ఓం ఓటింగ్ ప్రక్రియ చేపట్టేటప్పుడు ఆయా తాసిల్దార్, బిఎల్వోల సహాయం తీసుకోవాలి. ఈవీఎం మిషన్లో డిస్ట్రిబ్యూషన్ నుండి పోలింగ్ ప్రక్రియ ముగిసి కౌంటింగ్ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూములలో భద్రపరిచే వరకు మీదే బాధ్యత. పోలింగ్ డే రోజు మాక్ పోల్ ప్రక్రియ, ఈవిఎం మిషన్లు మొరాయిస్తే అతి త్వరగా మార్చేలా చర్యలు తీసుకోవాలి. ఈసీఐ గైడ్లైన్స్ ఉన్న అంశాలను జాగ్రత్తగా చదివి వాటి ప్రకారమే పోలింగ్ ప్రక్రియ నడిచే విధంగా చర్యలు తీసుకోవాలి. సెక్టర్ అధికారులు ఈవీఎం మిషన్లో బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ యూనిట్ వివి ప్యాడ్ అనుసంధానం నుండి పూర్తిగా క్లోజ్ చేసే వరకు ప్రతి విషయంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అందరి అధికారులను సమన్వయంతో ఎన్నికల విధులను సక్రమంగా విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఆర్డీవో బన్సీలాల్ డిపిఓ దేవకిదేవి తదితరులు పాల్గొన్నారు.